మాట్లాడే గుహ యొక్క రహస్యం
ఒకనాడు ఒక వేటగాడు అడవిలోకి వెళ్ళాడు. అడవిలో ఆ వేటగాడికి ఒక అందమయిన లేడి కనిపించింది. వేటగాడు ఆ లేడి వెనకాల పరిగెట్టాడు. కొంతసేపు ఆ లేడి వెనకాల పరిగెట్టాక, ఆలేడి మాయమయిపోయింది. ఇంకేముంది... వేటగాడు తప్పిపోయాడు. వేటగాడు నడవడం మొదలు పెట్టాడు. ఇంతలో చీకటి పడింది. వేటగాడికి ఒక గుహ కనిపించింది. ఈ రాత్రికి ఈ గుహలో ఉండి తెల్లారాక బయల్దేరదామని వేటగాడు అనుకున్నాడు. గుహలోకి వెళ్ళాడు.
తెల్లారాక గుహ బయటకి వెళ్దామంటే గుహ మూసుకు పోయి ఉంది.
ఎక్కణ్ణించో ఒక శబ్దం వచ్చింది. “నేనే ఈ గుహ. నా రహస్యం చెప్తాను. వింటావా?” అని
వేటగాడు సరే నన్నాడు.
గుహ రహస్యం చెప్పడం మొదలు పెట్టింది. “నేను కూడా ఒకప్పుడు ఒక మనిషిని. నేను కూడా నీలానే అడవిలోకి వచ్చాను. ఒక లేడిని చూశాను. దాని వెనకాల పరిగెడుతూ ఈ ప్రాంతానికి వచ్చాను. అప్పుడు ఆ లేడి దేవతలాగా మారిపోయింది. నాకు పరిక్ష పెట్టింది. అందులో నేను ఓడిపోయాను. అందుకే నన్ను ఈ గుహలా మార్చివేసింది. నాకు నీ సహాయం కావాలి, సహాయం కావాలి”
“సరే చేస్తాను. కానీ ఎలా?” అన్నాడు వేటగాడు.
“నాకు తెలిసి ఈ గుహలో ఒక రాయి ఉండాలి. ఆ రాయికి ఏమన్నా మూడు కోరికలు తీర్చే శక్తి ఉంది. ఆ రాయితో మళ్ళీ నన్ను మనిషిగా మార్చేసెయ్.” అని అంది గుహ.
“ఆ రాయి ఎక్కడవుంది” అని అడిగాడు వేటగాడు.
“ఇక్కడే ఎక్కడో ఉండాలి. వెతుకు” అంది గుహ
వేటగాడు చాలాసేపు వెతికాడు. వెంటనే ఫలితం కనపడ్లా. చాలాసేపటి తర్వాత ఒక స్థంభం కనపడింది. ఆ స్థంభం మీద ఏముందా అని చూస్తే కొన్ని చిత్రాలు కనపడ్డాయి. ఆ చిత్రాలు కొంచెం విచిత్రంగా ఉన్నాయి. వాటిని శ్రద్ధగా చూస్తే అది ఆ గుహరహస్యం. వేటగాడు వాటిని ఒక దాని తర్వాత ఒకటి నొక్కాడు. ఎక్కడినించో వేటగాడి చేతిలోకి ఒక రాయి వచ్చింది.
“అదే ఆ రాయి అదే ఆ రాయి” అంది ఆ గుహ.
వేటగాడు ముందుగా గుహని మనిషిగా మార్చేశాడు. తర్వాత ఇద్దర్నీ ఇంటింకి పంపించేశాడు. మూడో కోరిక మాత్రం ఆ గుహతోనే ఎప్పటికీ మిగిలి పోయింది.
- The End
1 comment:
Congratulations!
Your story is very cute and interesting. Keep writing. Good bless you!
Post a Comment